పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు | - | Sakshi
Sakshi News home page

పోచంపల్లిని సందర్శించిన విదేశీయులు

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని టీ హబ్‌లో నిర్వహించిన రివర్స్‌ బయ్యర్‌, సెల్లర్‌ మీట్‌లో పాల్గొన్న శ్రీలంక దేశానికి చెందిన వస్త్ర వ్యాపారులు ఇర్ఫాన్‌, సాజిద్‌ ఇక్కత్‌ వస్త్రాల తయారీ తీరుతెన్నులను ప్రత్యక్షంగా తెలుసుకొనేందుకు గురువారం పోచంపల్లిని సందర్శించారు. ఇక్కత్‌ వస్త్రాల తయారీ, రంగులద్దకం, చిటికి కట్టడం, ఆసు యంత్రం, గ్రాఫ్‌పై టై అండ్‌ డై విధానంలో డిజైన్లు వేయడం తదితర ప్రక్రియలను పరిశీలించారు. ఈ వారు మాట్లాడుతూ.. శ్రీలంకలో పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలను ప్రమోట్‌ చేస్తామని అన్నారు. అనంతరం జగదీశ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధి హేమ మాట్లాడుతూ.. శ్రీలంకలో చాలా మంది మహిళలు చీరలు ధరిస్తారని, కానీ ఇప్పటి వరకు ఆ దేశానికి పోచంపల్లి చేనేత వస్త్రాలు ఎగుమతి కాలేదని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో శ్రీలంకలో కూడా ఇక్కత్‌ వస్త్రాలకు మార్కెటింగ్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వారి వెంట టై అండ్‌ డై అసోసియేషన్‌ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, ఈపూరి ముత్యాలు, గంజి బాలరాజు, సీత లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు.

టూరిజం పార్కు సందర్శించిన జపనీయులు

పోచంపల్లిని జపాన్‌ దేశానికి చెందిన ఇద్దరు పర్యాటకులు సందర్శించారు. స్థానిక టూరి జం పార్కును సందర్శించి అక్కడ మ్యూజియంలో మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, డిజైన్లను పరిశీలించారు. కార్మికుల నైపుణ్యాలను కొనియాడారు.

ఫ చేనేత కార్మికుల నైపుణ్యాలను కొనియాడిన శ్రీలంక, జపాన్‌ దేశస్తులు

Advertisement
 
Advertisement
Advertisement