విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

మిర్యాలగూడ టౌన్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఇటికాల పురుషోత్తం అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్ధశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ‘బేసిక్‌ స్టాటిస్టిక్స్‌ ఇన్‌ టీచింగ్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌’ అనే అంశంపై అధ్యాపకులకు రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్‌షాప్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేటి విద్యా విధానంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమన్నారు. భవిష్యత్‌ తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు ఇటువంటి శిక్షణ తరగతులకు హాజరై సబ్జెక్ట్‌పై పట్టును సంపాదించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాభివృద్ధి కోసం అనేక సంస్కరణలను ప్రవేశపెడుతుందన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అత్యుత్తమ ఉపాధ్యాయులు రాబోయే తరాలను మార్చగలుగుతారని అన్నారు. స్టాటిస్టిక్స్‌ లాంటి కఠినతరమైన సబ్జెక్టుని విద్యార్థులకు సులభంగా అర్ధమయ్యేలా బోధించాలని సూచించారు. వర్క్‌షాప్‌ డైరెక్టర్‌ గుమ్మడి నరేష్‌ను అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్‌ భీమార్జున్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వర్క్‌షాప్‌లో రీజినల్‌ డైరెక్టర్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సుజిత్‌ కుమార్‌ మిశ్రా, ప్రొఫెసర్‌ రామకృష్ణ, గుమ్మడి నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ తెలంగాణ ఉన్నత విద్యామండలి

వైస్‌ చైర్మన్‌ పురుషోత్తం

Advertisement
 
Advertisement
Advertisement