ప్రైవేట్‌ వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ వద్దు.. ప్రభుత్వ బడి ముద్దు

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు

ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో..

భువనగిరి: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా జిల్లాలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో గత మార్చి నుంచే కార్యక్రమాన్ని చేపట్టారు. సాధారణంగా బడిబాటను జూన్‌ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తారు. కానీ గత ఏడాది నుంచి ముందస్తుగానే నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.

జిల్లాలో 715 పాఠశాలలు

జిల్లాలో మొత్తం 715 పాఠశాలలున్నాయి. ఇందులో జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 163, ప్రాథమికోన్నత పాఠశాలు 68, ప్రాథమిక పాఠశాలలు 484 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం 37,254 మంది విద్యార్థులు ఉన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమం ద్వారా బడిబయట ఉన్న 5,262 మంది విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించారు.

ఈ ఏడాది కూడా..

గత ఏడాది కంటే మించి బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి బడిలో చేర్పేందుకు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ సూచించింది. దీంతో జిల్లాలో కొన్ని పాఠశాలల్లో ముందస్తుగానే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన బోధన వివరాలను తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతిఽనిధుల సహకారం తీసుకుంటున్నారు.

ఊరూరా ముందస్తు బడిబాట

ఫ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, బోధనను వివరిస్తున్న ఉపాధ్యాయులు

ఫ బడి బయట, ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల గుర్తింపు

ఫ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా కార్యాచరణ

గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ముందస్తుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన, డిజిటల్‌ తరగతులు ఉన్నాయి. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.

– సత్యనారాయణ, డీఈఓ

ప్రస్తుతం ఒంటి పూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతున్నాయి. తాజాగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఏ–2 ప్రారంభమైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు ఉదయం లేదా మధ్యాహ్నం తర్వాత గానీ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సారి పీఎంశ్రీ కింద 10 ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలకు రూ. 4వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఆయా పాఠశాలల్లో పై తరగతులకు వెళ్లే వారిని గుర్తించి వారికి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రచారం నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement