లక్ష్యం 5,467.. తీసుకుంది 467 | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం 5,467.. తీసుకుంది 467

Apr 10 2026 9:33 AM | Updated on Apr 10 2026 9:33 AM

అవగాహన కల్పిస్తున్నాం

భువనగిరి: మహిళల్లో గర్భాశయ ముఖ ద్వార(సర్వైకల్‌) క్యాన్సర్‌ను నిరోధించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ(హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకాల పంపిణీలో జిల్లా వెనుకంజలో ఉంది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.14–15 ఏళ్ల మధ్య బాలికలకు టీకాలు వెస్తున్నారు. తొలి విడతలో భాగంగా జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్‌ సీహెచ్‌సీలలో ప్రారంభించారు. రెండో విడతకింద గత నెల 30న జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మొదలు పెట్టారు.

నెల రోజుల్లో ఎనిమిది శాతానికిపైగా..

జిల్లాలో 5,467 మంది కిశోర బాలికలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో చాలా మంది 9,10 తరగతుల వారే. వీరు ప్రస్తుతం పరీక్షల బిజీలో ఉన్నారు. దీంతో కార్యక్రమం అంచనా మేరకు విజయవంతం కావడం లేదు. మూడు నెలల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో నెల రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో 467 మంది బాలికలు మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ప్రారంభంలో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమం పండుగలు, పరీక్షల నేపథ్యంలో వెనుకబడింది. ఇంకా రెండు నెలల్లో 5వేల మంది బాలికలకు వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంది.

ఎన్నో ప్రయోజనాలున్నా

మహళలు కొన్ని పరిస్థితుల్లో ఇన్‌ఫెక్షన్‌బారిన పడుతుంటారు. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. ప్రధానంగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఈ టీకా ఉపయోగపడుతుంది.

స్పందన అంతంతే..

14–15ఏళ్ల బాలికల్లో అత్యధికులు ప్రస్తుతం పది పరీక్షలకు హాజరవుతున్నారు. దీనికి తోడు ఈ నెల 8వ తేదీ నుంచి 9వ తరగతి విద్యార్థులకు సైతం పాఠశాలల్లో ఎస్‌ఏ–2 ప్రారంభంకావడంతో పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నేపథ్యంలో టీకా తీసుకుంటే ఏవైనా ఆరోగ్య సమస్యలు రావొచ్చని చాలా మంది బాలికలు వెనుకంజ వేస్తున్నారు. వైద్యాధికారులు కూడా పాఠశాలలు, కేజీబీవీల్లో అవగాహన కల్పిస్తున్నా స్పందన తక్కువగానే ఉంది.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌లో వెనకంజ

ఫ నెలరోజుల్లో ఎనిమిది శాతానికిపైగా నమోదు

ఫ అవగాహన కల్పిస్తున్నా ఆసక్తిచూపని బాలికలు

కిశోర బాలికలు హెచ్‌పీవీ టీకాలు వేసుకోవాలి. ఎలాంటి అపోహల నమ్మవద్దు. భవిష్యత్‌లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ రాకుండా నిరోధించడానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తోడ్పడుతుంది. తల్లిండ్రులు వారి పిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇప్పించేందుకు ముందుకు రావాలి. వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు జిల్లాలో వివిధ శాఖల సమన్వయంతో పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం.

– రామకృష్ణ, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement