ఆలేరు: పాడి రైతులు కన్నెర చేశారు. పాల బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ గురువారం ఆలేరు పట్టణంలోని కొలనుపాక మార్గంలో ఉన్న శ్రీకృష్ణ పాల సొసైటీకి తాళం వేశారు. అనంతరం సొసైటీ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సొసైటీ డైరెక్టర్ జెల్లి నర్సింహులు మాట్లాడుతూ సొసైటీ పరిధిలోని 40మంది రైతులకు ఐదు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 15రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా...తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. మదర్‌డెయిరీ నిర్వాకం వల్ల రైతులు పాడి ఆవులను అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొందన్నారు. ఇప్పటికై నా పెండింగ్ పాల బిల్ల్లులు చెల్లించపోతే మదర్ డెయిరీ కార్యా
లయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బిల్లులు చెల్లించే వరకు పాలు పోయబోమని రైతులు స్పష్టం చేశారు. సొసైటీ కార్యదర్శి రత్నం మదర్ డెయిరీ అధికారులతో మాట్లాడి త్వరగా బిల్లుల చెల్లించేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు అంగీకరించి పాలు పోశారు. ఈకార్యక్రమంలోమొరిగాడి అశోక్, మొరిగాడి దేవేందర్, జూకంటి శంకర్, పాకాల విఘ్నేశ్వర్, పాపయ్య, చిమ్మిరవి, సీసా రేణుక, చంద్రయ్య, అనిమిరెడ్డి పాల్గొన్నారు.
ఫ ఆలేరులో పాడి రైతుల ధర్నా


