భువనగిరి: ఎయిడ్స్ రహిత సమాజమే ప్రతి ఒక్కరి లక్ష్యమని భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈర్యాలీ జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి జగదేవ్‌పూర్ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆస్పత్రిలో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించారు. సబ్ జైలులో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ, విజయ్‌పటేల్, సాగరిక, శైలజ, సబ్ జైలు సూపరింటెండెంట్ నెహ్రునాయక్, నిరోష, నితీషా, గాయత్రి, నీడ్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ బాను, సిబ్బంది, ఆశావర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


