సెలవులు జీవితాలు | - | Sakshi
Sakshi News home page

సెలవులు జీవితాలు

Jan 18 2026 8:08 AM | Updated on Jan 18 2026 8:08 AM

సెలవు

సెలవులు జీవితాలు

నల్లగొండ, అర్వపల్లి : ఆ నలుగురు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు. వారంతా ఒకే మండలంలో పనిచేస్తున్నారు. నల్లగొండ నుంచి తుంగతుర్తి మండలానికి ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి వెళుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్న వారు సెలవులు ముగియడంతో శనివారం పాఠశాలలకు పయనమయ్యారు. మరో అరగంటలో బడులకు చేరుకుంటారనగా.. మార్గమధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి శివారులో శనివారం ఉదయం జరిగిన ఈ సంఘటన ఉపాధ్యాయ లోకాన్ని విషాదంలోకి నెట్టివేసింది. విద్యార్థులను కలిచివేసింది.

నల్లగొండ నుంచి తుంగతుర్తికి..

తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కేజీబీవీ ప్రత్యేక అధికారిణి మామిడాల కల్పన(43), తుంగతుర్తి మండలం రావులపల్లి జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయురాలు పోరెడ్డి గీత(48)తో పాటు తుంగతుర్తి జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు అలువాల ప్రవీణ్‌కుమార్‌, తుంగతుర్తి మండలం అన్నారం జడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయురాలు అలువాల సునితారాణి శనివారం ఉదయం గీతకు చెందిన కారులో నల్లగొండ నుంచి పాఠశాలలకు బయలుదేరగా అర్వపల్లి శివారులోని ముదిరాజ్‌కాలనీ వద్ద కారు అదుపు తప్పి పల్టీలు కొడుతూ టైరు పేలి 200 మీటర్ల దూరంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో రోడ్డుపై దుమ్ములేవడంతో అక్కడ ఏమీ కనిపించలేదని స్థానికులు తెలిపారు. కల్పన, గీత తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. సునితారాణి, ప్రవీన్‌కుమార్‌లు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కారు డ్రైవర్‌ గిరికి స్వల్ప గాయాలయ్యాయి.

సీటు బెల్టులు ధరించి ఉంటే..

కారులో డ్రైవర్‌తో పాటు ఉపాధ్యాయులు కూడా సీటు బెల్టులు ధరించలేదు. ఈ బెల్టులు ధరించి ఉంటే ఇంతపెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని పోలీసులు చెబుతున్నారు.

నివాళులర్పిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఫ మరో అరగంట అయితే పాఠశాలలకు వెళ్లేవారే..

ఫ ఈలోపే కబళించిన మృత్యువు

ఫ రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఓ, హెచ్‌ఎం మృతి

ఫ మరో ఇద్దరు హెచ్‌ఎంలకు తీవ్ర గాయాలు

ఫ గాయపడిన హెచ్‌ఎంలు అన్నాచెల్లెళ్లు

ఫ విషాదంలో ఉపాధ్యాయ లోకం

సెలవులు జీవితాలు 1
1/1

సెలవులు జీవితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement