సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం
చౌటుప్పల్ : చౌటుప్పల్ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. పిలాయిపల్లి కాలువ నుంచి లక్కారం చెరువులోకి మూసీ జలాలను తరలించేందుకు దివీస్ పరిశ్రమ సీఎస్‌ఆర్ నిధులు రూ.1.10లక్షలతో రూపొందించిన లిఫ్ట్ పథకానికి శనివారం చిన్నకొండూర్ గ్రామ శివారులో ఆయన శంకుస్థాపన చేశారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడేనికి జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి దివీస్ పరిశ్రమ సీఎస్‌ఆర్ నిధులు రూ.88లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులకు దివీస్ పరిశ్రమ తమ వంతుగా సీఎస్‌ఆర్ నిధులు వెచ్చించడం అభినందనీయమన్నారు. ఇతర పరిశ్రమల యాజమాన్యాలు సైతం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ మనోహర్, డీఈ కృష్ణారెడ్డి, ఏఈలు పృథ్వీ, వెంకటరమణ, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, దివీస్ జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఎంపీడీఓ సందీప్‌కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పబ్బు రాజుగౌడ్, దివీస్ ప్రతినిధులు బి.కిషోర్‌కుమార్, గోపి, శివకృష్ణ, పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి


