త్వరగా వస్తానని చెప్పి..
నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే లింగంపల్లి కల్పనకు 2024 డిసెంబరులో తుంగతుర్తి కేజీబీవీ పాఠశాలలో ఎస్‌వోగా కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగం వచ్చింది. ఆమె భర్త యాదగిరి నల్లగొండలో ఎన్జీ కాలేజీ ఎదురుగా ఉన్న పోలీస్ కాంప్లెక్స్‌లో మీసేవ కేంద్రం నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు శ్రీకర్, కూతురు సాత్విక ఉన్నారు. కుమారుడు బీటెక్ మొదటి సంవత్సరం, కూతురు ఎంబీబీఎస్ చదువుతున్నది. సంక్రాంతి పండుగకు పిల్లలు ఇద్దరు నల్లగొండకు వచ్చారు. అంతా ఆనందంగా గడిపారు. కూతురు సాత్విక పుట్టిన రోజు శుక్రవారం కావడంతో కుటుంబ సభ్యులు సాత్విక స్నేహితులు కలిసి ఇంట్లో వేడుకలు చేసుకున్నారు. మరుసటి రోజైన శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరి మృతిచెందింది.
ఇంత ఘోరం జరిగిందని అనుకోలేదు..
నా భార్యను నేను వెంకటేశ్వర కాలనీ వద్ద కారు ఎక్కించి వచ్చాను. మా తోడల్లుడు ఫోన్ చేసి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. నేను ఏదో దెబ్బలు తగిలాయని అనుకున్నా. 9.10 గంటలకు నా భర్య చనిపోయిందని చెప్పారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని కల్ప న భర్త యాదగిరి బోరున విలపించారు. సాయంత్రం త్వరగా వస్తానని చెప్పింది.. సాయంత్రం కంటే ముందుగానే శవమై వచ్చిందని విలపించారు.


