గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
భువనగిరిటౌన్: గణతంత్ర వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ తన చాంబర్‌లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించిన అనంతరం మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకల నిర్వహణకు అవసరమైన వేదిక, వీఐపీలు, అధికారులు, ఇతరులకు సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేయాలన్నారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులచే సాంస్కృక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీఓ కృష్ణా రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామలింగం, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి జగన్మోహన్ ప్రసాద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు


