ఆరు మాసాల క్రితమే ప్రమోషన్
నల్లగొండంలోని లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న పోరెడ్డి గీతకు ఆరు మాసాల క్రితమే గెజిటెడ్ హెచ్‌ఎంగా పదోన్నతి లభించింది. పెద్దకాపర్తి నుంచి తుంగతుర్తి మండలం రావులపల్లి ప్రభుత్వ పాఠశాలలో గెజిటెడ్ హెచ్‌ఎంగా పోస్టింగ్ వచ్చింది. భర్త రఘుపతిరెడ్డి నల్లగొండ ఎస్పీ కార్యాలయంలోని ఎస్‌బీలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కొడుకు సాయినితిన్‌రెడ్డి, కూతురు సౌమిక ఉన్నారు. ఇరువురు అమెరికాలో ఉంటున్నారు. కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. సౌమిక తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటుంది. ఫిబ్రవరి 22న అమెరికా వెళ్లి రెండు నెలలు అక్కడే ఉండి తిరిగి వద్దామని అనుకున్నారు. టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇంతలోనే గీత మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబమం దుఃఖసాగరంలో మునిగిపోయింది. తల్లిని కడసారి చూసేందుకు అమెరికాలో ఉన్న ఇద్దరు పిల్లలు బయల్దేరారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. సోమవారం గీత అంత్యక్రియలు నల్లగొండలో జరగనున్నాయి. ఆమె మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.
ప్రార్థనకు రాలేదని..
గీత ఆరు నెలలుగా క్రమంతప్పకుండా ప్రా ర్థన సమయానికి పాఠశాలకు హాజరవుతుంది. శనివారం ప్రార్థనకు రాలేదని, ఇంతలో ఈ దుర్వా ర్త వినాల్సి వచ్చిందని తోటి టీచర్లు కన్నీరు పెట్టారు.


