డివైడర్‌ను దాటొచ్చి కారును ఢీకొన్న లారీ
చౌటుప్పల్ : అతి వేగంగా వచ్చిన సిమెంట్ రెడీమిక్స్ ట్యాంకర్ లారీ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను దాటి వెళ్లి కారును ఢీకొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జాతీయ రహదారిపై చౌటుప్పల్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సూరారం ప్రాంతానికి చెందిన ముడావత్ భాస్కర్‌నాయక్‌తోపాటు అతడి స్నేహితుడు యాకోబు, అతడి భార్య ఫాతిమా, కుమారులు మోసిన్, బిలాల్ కారులో ఈ నెల 14వ తేదీ రాత్రి కారులో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. పట్టణంలోని తంగడపల్లి చౌరస్తా వద్దకు రాగానే హైదరాబాద్ రూట్‌లో వెళ్తున్న సిమెంట్ రెడీమిక్స్ ట్యాంకర్ లారీ వేగంగా దూసుకువచ్చి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ వద్ద ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అదే వేగంతో అవతలివైపు వెళ్లి కారును ఢీకొట్టింది. దాంతో కారులోని ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మండలంలోని కొయ్యలగూడెం గ్రామానికి చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్ ప్రకాశ్‌యాదవ్(37)ను పోలీసులు అదుపులోకి తీసుకొని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఫ నలుగురికి తీవ్ర గాయాలు


