ఈతకు వెళ్లి గుంతలో పడి బాలుడు మృతి
మర్రిగూడ : ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మర్రిగూడ మండలంలోని వెంకేపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకేపల్లి గ్రామానికి చెందిన గోగుల అంజయ్య, శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అక్షయ్‌కుమార్(11) సంతానం. అక్షయ్‌కుమార్ మంగళవారం గ్రామ శివారులో శివన్నగూడెం రిజర్వాయర్ మట్టి కోసం తవ్విన గుంతలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. అక్షయ్‌కుమార్ మాల్‌లోని కృష్ణవేణి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ మునగాల కృష్ణారెడ్డి తెలిపారు.


