చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఆలేరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మున్సిపాలిటీ పరిధి లోని పోచమ్మ గుడి ప్రాంతానికి చెందిన బండి వెంకటేష్(53) సోమవారం సాయంత్రం స్థాని కంగా ఉన్న సాయిబాబా గుడికి బైక్‌పై వెళ్తున్నా డు. ఈ క్రమంలో రెడ్డిగూడెం కమాన్ సమీ పంలోకి రాగానే వెంకటేష్ బైక్, మరో స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కాగా.. స్కూటీపై వెళ్తున్న నందిని అనే యువతికి కూడా గాయాలయ్యా యి. వెంకటేష్‌ను హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
మర్రిగూడ : బైక్‌పై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మర్రిగూడ మండలం సరంపేట గ్రామ శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అతివేగంతో వెళ్తూ సరంపేట గ్రామ సమీపంలో చండూరు ప్రధాన రఽహదారిపై అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మర్రిగూడ పోలీసులు తెలిపారు.
చైనా మాంజా
విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు
వలిగొండ : మండల పరిధిలోని గోకారం గ్రామానికి చెందిన వాసం నారాయణ తన కిరాణ దుకాణంలో నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తుండగా.. స్థానిక పోలీసులు దాడి చేసి ఐదు కట్టల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ యుగంధర్ మంగళవారం తెలిపారు.
అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన కారు
కొండమల్లేపల్లి : అదుపుతప్పి కారు కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో మంగళవారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి పరిధిలో జరిగింది. దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జగమంతు నల్లగొండ నుంచి కారులో వస్తుండగా.. మార్గమధ్యలో గుమ్మడవెల్లి గ్రామ పరిధిలోని రైస్ మిల్లు వద్దకు రాగానే అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగమంతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని కొండమల్లేపల్లి ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.


