మున్సిపల్ ఓటర్లు 1,32,725 మంది
16న ఫొటోతో
కూడిన ఓటరు జాబితా
ఏర్పాట్లు చేస్తున్నాం
సాక్షి,యాదాద్రి: మున్సిపల్ ఓటర్ల లెక్క తేలింది. ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించిన అధికారులు వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను సోమవారం విడుదల చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 1,32,725 మంది ఓటర్లు ఉన్నారు. మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ప్రకటించనున్నారు. ఈనెల 16న ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా విడుదల చేస్తారు
2,833 మంది మహిళా ఓటర్లు అధికం
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 1,32,725 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 64,937 మంది పురుషులు, 67,770 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా భువనగిరిలో 47,831 మంది ఓటర్లు, అత్యల్పంగా ఆలేరులో 13,632 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో మాదిరిగానే తుదిజాబితాలో మొత్తంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,833 మంది అధికంగా ఉన్నారు. మున్సిపాలిటీల వారీగా చూసినా అన్నింటిలోనూ మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు.
కార్యాలయాల వద్ద అందుబాటులో..
తాజాగా విడుదల చేసిన ఓటరు తుది జాబితాలను వార్డుల వారీగా మున్సిపల్, తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల వద్ద అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉండగా 2025 అక్టోబర్ 1న తేదీనాటి జాబితా ఆధారంగా ముసాయిదా జాబితాను 2026 జనవరి1న ప్రకటించారు. మున్సిపాలిటీలు, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించారు. కొన్నిచోట్ల ఓటర్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 153 అభ్యంతరాలు రాగా వాటన్నింటినీ పరిష్కరించిన అధికారులు సోమవారం వార్డుల వారీగా ఓటరు తుది జాబితాను ప్రకటించారు.
ఆరు మున్సిపాలిటీల్లో మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను అధికారులు ప్రకటిస్తారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిష్కరిస్తారు. ఇక ఈనెల 16న ఫొటోతో కూడిన ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారు. ఈ జాబితా ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి.
ఓటరు తుది జాబితా ప్రకటించిన అధికారులు
ఫ అత్యధికంగా భువనగిరిలో 47,831 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 13,632 మంది ఓటర్లు
ఫ పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
ఫ నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటన
ఫ 16న ఫొటోతో కూడిన ఓటరు జాబితా
మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటరు తుది జాబితాలను ప్రకటించాం. 104 వార్డుల్లో 211 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి వార్డులో రెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అధికంగా ఓటర్లు ఉన్న చోట మూడు పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, డెడికేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం బీసీ, జనరల్ రిజర్వేషన్లు ఉంటాయి.
– భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్
మున్సిపాలిటీ వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
ఆలేరు 12 6,671 6,960 01 13,632
భువనగిరి 35 23,037 24,793 01 47,831
చౌటుప్పల్ 20 13,553 13,663 – 27,216
మోత్కూరు 12 7,106 7,277 – 14,383
పొచంపల్లి 13 7,808 8,031 – 15,839
యాదగిరిగుట్ట 12 6,762 7,046 16 13,822
మొత్తం 104 64,937 67,770 18 1,32,725
మున్సిపల్ ఓటర్లు 1,32,725 మంది


