క్రీడా సంగ్రామం
క్రీడా పోటీలు ఎప్పుడంటే..
క్రీడా పోటీల్లో పాల్గొనాలి
భువనగిరి: గ్రామ స్థాయి నుంచే క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు వేదికగా నిలువనున్నాయి. సీజన్–2 సీఎం కప్ పోటీలు ఈ నెల 17 నుంచి ప్రారంభించేలా షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో సీఎం కప్ క్రీడా పోటీలపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వీటితో పాటు వచ్చే సోమవారం మండల కేంద్రాల్లోనూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి
ప్రపంచ చాంపియన్స్ నినాదంతో..
విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులున్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తెచ్చేందుకు ఈ సారి గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ చాంపియన్స్ అనే నినాదంతో పోటీలు నిర్వహిస్తున్నారు.
29 అంశాలలో..
రాష్ట్ర స్థాయి 44 క్రీడా అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 29 క్రీడా అంశాలలో పోటీలు నిర్వహించేలా అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్(బాల,బాలికలు) విభాగాలతో పాటు ఓపెన్ రిక్రియేషన్ గేమ్స్(పిల్లలు, ఇతరులు)కు అవకాశం ఉంది. గత ఏడాది జిల్లాలో 29 రకాల క్రీడల్లో పోటీలు జరగగా 564మంది ని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించారు. 2023 సంవత్సరానికి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ఖోఖో జట్టు ప్రథమ స్థానంలో రాణించడం వల్ల రూ. లక్ష నగదు ప్రోత్సాహకాన్నిసైతం పొందింది.
ప్రతిభ చాటిన వారికి నగదు ప్రోత్సాహకం
సీఎం కప్ పోటీలు జిల్లాలో గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. లక్ష, ద్వితీయ స్థానం పొందిన జట్టుకు రూ. 75వేలు, తృతీయ స్థానం అయితే రూ. 50వేలు, వ్యక్తిగత క్రీడాంశాలలో ప్రథమ రూ. 20వేలు, ద్వితీయ రూ. 15వేలు, తృతీయ రూ. 10వేలు ఉంటుంది.
ఆన్‌లైన్ ద్వారా నమోదుకు అవకాశం
పోటీల్లో పాల్గొనేందుకు అధికారులు ఆన్‌లైన్ విధానం ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేందుకు వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. క్రీడాకారులు తమ పేర్లను satg.telangana.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటున్నారు.
ఫ ఐదు స్థాయిల్లో సీఎం కప్ పోటీల నిర్వహణ
ఫ 17న గ్రామ స్థాయి పోటీలతో శ్రీకారం
ఫ ఇప్పటి వరకు 1,500 మంది నమోదు
గ్రామ పంచాయతీ స్థాయిలో ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు, మండల స్థాయిలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి.రాష్ట్ర స్థాయి పోటీలు ఫిబ్రవరి 19 నుంచి 26వరకు జరగనున్నాయి
సీఎం కప్ పోటీల కోసం పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగానీ పీఈటీలుగానీ ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి.
– కె.ధనుంజనేయులు, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి శాఖ అధికారి
క్రీడా సంగ్రామం


