అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ భాస్కరరావుతో కలిసి ప్రజల నుంచి 35 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 22, సివిల్ సప్లయీస్ 6, గ్రామీణ అభివృద్ధి శాఖ 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, సర్వే ల్యాండ్స్ , వ్యవసాయ, మున్సిపాలిటీ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున వచ్చినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ జయమ్మ, జెడ్పీసీఈఓ శోభారాణి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు
త్వరగా పూర్తి చేస్తాం
జిల్లాలో భువనగిరి, ఆలేరులో మంజూరైన రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇందులో కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


