ఇచ్చిన హామీలు అమలు చేయాలి
భూదాన్‌పోచంపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ డిమాండ్ చేశారు. శనివారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో చేనేత రుణమాఫీతో పాటు చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేనేత సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడో రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా వాంటావార్పు చేసి నిరసన తెలిపారు. దీక్షా శిబిరాన్ని బూర నర్సయ్యగౌడ్ సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి చేనేత కార్మికులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించి నేటికీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. త్రిఫ్ట్ ఫథకం, నేతన్న భరోసా, నూలు సబ్సిడీ ఏ ఒక్కటి కూడా అమలు కావడంలేదని విమర్శించారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, కిసాన్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డి, ఎన్నం శివకుమార్, ఏలే చంద్రశేఖర్, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ గంజి బస్వలింగం, పట్టణ అధ్యక్షుడు డబ్బికార్ సాహేశ్, అసెంబ్లీ కన్వీనర్ చిక్క కృష్ణ, పల్లెకాడి బస్వయ్య, మండల అధ్యక్షుడు మేకల రవీందర్‌రెడ్డి, ఏలే శ్రీనివాస్, చింతకింది రమేశ్, ఏలే భిక్షపతి, రచ్చ సత్యనారాయణ, భారత భూషణ్, శ్రీహరి, రుద్ర నర్సింహ, భారత బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్


