రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపిక
హాలియా : హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎంపికై నట్లు నల్లగొండ జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) సెక్రటరీ విమల శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగే అండర్–17 ఎస్‌జీఎఫ్ 69వ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో తేజు తెలంగాణ రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిధ్య వహించనున్నట్లు ఆమె తెలిపారు. గతేడాది నవంబర్‌లో నల్లగొండలో జరిగిన అండర్–17(ఎస్‌జీఎఫ్) 69వ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు తరఫున తేజు బరిలోకి దిగి ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయికి ఎంపికై నట్లు వివరించారు. ప్రస్తుతం తేజు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఫుట్‌బాల్ అకాడమీ–జనగామ జిల్లా కేద్రంలో శిక్షణ పొందుతున్నాడని పేర్కొన్నారు. తనను ప్రోత్సహించిన జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీ విమల, సీనియర్ పీడీ, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఫుట్‌బాల్ అకాడమీ కోచ్ లింగానాయక్‌కి తేజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.


