రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో నిడమనూరు ఆదర్శ విద్యార్థు
నిడమనూరు : ఈ నెల 7,8,9వ తేదీల్లో కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో నిడమనూరు ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జూనియర్ విభాగంలో పాఠశాలకు చెందిన ఈ. పవన్‌కుమార్ ప్రదర్శించిన ఆల్కహాల్ డిటెక్షన్ వెహికిల్ కంట్రోల్ (హెల్త్ అండ్ హైజీన్) ఎగ్జిబిట్‌కు రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. సీనియర్ విభాగంలో పాఠశాలకు చెందిన కె.వెంకట్ ప్లాట్ మెజర్‌మెంట్(గణిత నమూనా)కు రాష్ట్రస్థాయిలో రెండో బహుమతిని లభించింది. వీరికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయి సైన్స్‌ఫెయిర్‌లో బహుమతులు అందుకున్న విద్యార్థులను నల్లగొండ డీఈఓ భిక్షపతి, జిల్లా సైన్స్ ఆఫీసర్ లక్ష్మీపతి, పాఠశాల ప్రిన్సిపాల్ బి.నిర్మల, సైన్స్ ఉపాధ్యాయులు సైదులు, వెంకటేశ్వర్లు, నరేష్‌కుమార్, సంధ్య, చంద్రశేఖర్‌లు అభినందించారు.


