బీసీలను పాలకులుగా నిలబెడతాం | - | Sakshi
Sakshi News home page

బీసీలను పాలకులుగా నిలబెడతాం

Jan 9 2026 11:19 AM | Updated on Jan 9 2026 11:19 AM

బీసీలను పాలకులుగా నిలబెడతాం

బీసీలను పాలకులుగా నిలబెడతాం

యాదగిరిగుట్ట: బీసీల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తులో బీసీలను పాలకులుగా నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో మన ఆలోచన సాధన సమితి(మాస్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జనాభా ధామాషా ప్రకారం బీసీలకు వాటా దక్కించుకోవడం, రాజకీయ అధికారం అంతిమ లక్ష్యంగా శిబిరాలు నడుస్తున్నాయన్నారు. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు బీసీ నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా మాస్‌ ముందుకు కదులుతుందన్నారు. మెజార్టీ ప్రజలకు రావాల్సిన రాజ్యాధికారం అందకుండా పోతుందని, పాలకులుగా కావాల్సిన వారు పాలితులుగానే ఉంటున్నారన్నారు. బీసీలంతా సైనికులుగా తయారై రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలన్నారు. రాష్ట్ర తొలి బీసీ కమిషన్‌ సభ్యుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్‌ జూలూరు గౌరీ శంకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ ఉద్యమం తీవ్రమైతుందని అన్నారు. దానిని ఆపటం ఎవరితరం కాదని పేర్కొన్నారు. బీసీ ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా నడిపించేందుకు బీసీలందరూ ఒక్కతాటి పైకి తీసుకురావాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌ బీసీలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. నిజంగా కాంగ్రెస్‌కు బీసీలపై ప్రేమ ఉంటే పార్లమెంట్‌లో ప్రైవేట్‌ బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ పార్టీలకు బీసీలంటే చిత్తశుద్ధి లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగరావు, గౌరవ అధ్యక్షుడు గడ్డం నర్సింహగౌడ్‌, పూస నర్సింహా బెస్త, సలహా మండలి సభ్యుడు తడక యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండ్ల ఆంజనేయులుగౌడ్‌, పంతంగి విట్టలయ్యగౌడ్‌, అధికార ప్రతినిధులు మంగిళిపల్లి శంకర్‌ గంగపుత్ర, ఆవుల వెంకట్‌యాదవ్‌, సంగెం రమేశ్వర్‌ నేత, కోరంగి దుర్గారాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బచ్చనబోయిన శ్రీనివాసులు, గోద మల్లికార్జున్‌గౌడ్‌, రాష్ట్ర కార్యదర్శి గునిగంటి చంద్రశేఖర్‌గౌడ్‌, రాష్ట్ర ప్రచార కార్యదర్శులు పెద్దవురా బ్రహ్మయ్య రజక, కొంపోజు నరహరిచారి, జక్కుల బాలరాజు యాదవ్‌, శ్రీకాంత్‌ గంగపుత్ర, నక్క కాాశినాథ్‌, చుక్కల సత్యనారాయణ, పవన్‌కుమార్‌, మరోజు రాజుచారి, నిమ్మల సత్యం, పెండం లక్ష్మణ్‌, వడ్డేపల్లి దశరథ సాగర్‌, కై రంకొండ నర్సింగ్‌, తిప్పరి లింబాద్రి, మురళీచారి, దశరథ్‌ రజక, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ

అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement