మద్యం షాపు ఎదుట విద్యార్థుల ధర్నా
పెద్దఅడిశర్లపల్లి : నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలో పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం పాఠశాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్యం షాపు ఎదుట ధర్నా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను వెంటనే మరో చోటుకు తరలించాలన్నారు. ఈ ధర్నాలో విద్యార్థులతో పాటు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, పలువురు సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఫ పాఠశాల సమీపంలో నుంచి
తొలగించాలని డిమాండ్


