మొదలైన సంక్రాంతి రద్దీ
కోదాడరూరల్ : సంక్రాంతికి వారం రోజులు ముందు నుంచే ఏపీ వైపు వాహనాల రద్దీ మొదలైంది. గురువారం హైదరాబాద్–విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. కోదాడ మండలం కొమరబండ వై జంక్షన్ నుంచి రాష్ట్ర సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్ వరకు క్రాసింగ్‌ల వద్ద పోలీసులు ఇప్పటికే బారికేడ్లను ఏర్పాటు చేశారు. కోదాడలోని కట్టకమ్ముగూడెం క్రాసింగ్‌ను మూసివేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న కొమరబండ వైజంక్షన్, రామాపురం క్రాస్‌రోడ్ వద్ద ట్రాఫిక్‌జామ్ అవుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.


