ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏటీసీల ఏర్పాటు
హుజూర్‌నగర్ : యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్సాలజీ సెంటర్స్‌ను(ఏటీసీ) ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, ఐటీఐ కళాశాల పనులను బుధవారం మంత్రి పర్యవేక్షించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఏటీసీల ద్వారా అందించే శిక్షణలో ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, 3డీ లేజర్ ప్రింటింగ్, మ్యానుఫ్యాక్షరింగ్ ప్రాసెసింగ్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, సీఎస్‌సీ మిషన్ టెక్నీషియన్ లాంటి ఆధునిక కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో 172 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, వారందరికీ శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఐటీఐ కళాశాల భవన నిర్మాణంలో నాణ్యత పాటిస్తూ పనులు వేగవంతంగా పూర్తి చేసి జూన్ నాటికి తరగతులు నిర్వహించేలా చూడాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా హుజూర్‌నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆర్‌ఆండ్‌బీ గెస్ట్ హౌస్, షాపింగ్ కాంప్లెక్స్, నీటిపారుదల శాఖ కార్యాలయం పనులను కూడా మంత్రి పరిశీలించారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన లబ్ధిదారులకు హుజూర్‌నగర్ మండల పరిషత్ కార్యాలయంలో రూ.1.71 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన వెంట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఏటీసీ ప్రిన్సిపాల్ శ్రీరాంరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రాధికాఅరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతరామయ్య, ఇరిగేషన్ ఈఈ నాగభూషణం, డీఈ రమేష్, తహసీల్ధార్లు, ఎంపీడీఓలు, సర్పంచులు తదితరులు ఉన్నారు.
ఫ భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


