12న తుది ఓటరు జాబితా
భూదాన్‌పోచంపల్లి: మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను ఈనెల 12న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. గురువారం సాయంత్రం ఆయన పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ముసాయిదా ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఈ నెల 13న పోలింగ్ కేంద్రాల జాబితాను కూడా ప్రదర్శించి, 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోతో కూడిన తుది జాబితాను ప్రచురించాలని మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డిని ఆదేశించారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ కేంద్రమైన స్థానిక వినోబాభావే మందిరాన్ని సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ పి. శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్లు రాజేశ్, ఆదిత్య ఉన్నారు.
సకాలంలో జాబితా పూర్తి చేయాలి
భువనగిరిటౌన్ : ముసాయిదా ఓటరు జాబితా సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి మండలం దివ్య బాల స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ – రిసెప్షన్ సెంటర్ ను ఆయన గురువారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో కీలక మైన కౌంటర్లు, సామగ్రి పంపిణీ ఏర్పాట్లు, రిసెప్షన్ డెస్కులు, నియంత్రణ గదులు, మౌలిక సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు


