సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే పరీక్షలు
చౌటుప్పల్ : ఇంటర్ బోర్డు నిర్వహించే ప్రతి పరీక్ష సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేకాధికారి భీంసింగ్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలోని పలు జూనియర్ కళాశాలలను ఆయన గురువారం సందర్శించారు. ప్రతిభ ఒకేషనల్ కళాశాలలో ల్యాబ్ పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాక్టికల్, థియరీ పరీక్షల సమయంలో కళాశాలల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని వసతులు కల్పించాలన్నారు. వార్షిక పరీక్షలకు ప్రభుత్వ కళాశాల విద్యార్తులను అన్ని విధాలుగా సంసిద్ధులను చేసేందుకు అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. నూరుశాతం ఫలితాల సాధనకు ప్రణాళికతో పనిచేయాలని కోరారు. ఈనెల 21న ఇంగ్లిష్ ప్రథమ సంవత్సరం, 22న ద్వితీయ సంవత్సరం, 24న పర్యావరణ ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1నుంచి ప్రాక్టికల్స్ మొదలవుతాయని తెలిపారు. అదే నెల 25నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఫ ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ భీంసింగ్


