సాఫీగా నీరు పారేలా..
కాలువ విస్తరణకు సంబంధించిన పనులు చివరిదశలో ఉన్నాయి. అక్టోబర్, నవంబర్‌లో అకాలవర్షాల వల్ల సిమెంట్, కాంక్రీటు పనులకు ఆటంకం కలిగింది. ప్రస్తుతం స్ట్రక్చర్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మాతో పాటు, కాంటాక్ట్ సంస్థ ప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. పనుల ప్రగతిని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. రైతులకు వీలయినంత త్వరగా నీరు అందించాలనే సంకల్పంతో ఉన్నారు.
– కె.కృష్ణారెడ్డి, డీఈ నీటిపారుదలశాఖ
రామన్నపేట: యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాల్లోని సుమారు పద్దెనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే ధర్మారెడ్డిపల్లి కాలువ ఆధునీకరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాలువ తవ్వకం(ఎర్త్‌వర్కు) దాదాపు పూర్తయింది. సిమెంట్ కాంక్రీటు పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్ణీత గడువుకంటే ముందే పనులు పూర్తిచేసి వచ్చే వానాకాలం వరకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
118 స్ట్రక్చర్స్....71 వంతెనలు
ధర్మారెడ్డిపల్లి కాలువ రెండుజిల్లాల పరిధిలో ఽ51.51కి.మీ విస్తరించి ఉంది. స్థిరీకరించిన ఆయకట్టు 5,126 ఎకరాలు. అదనంగా 12,661 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో కాలువలో పారే నీటి సామర్థ్యాన్ని 50 క్యూసెక్కుల నుంచి 208 క్యూసెక్కులకు పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలువ ఆధునీకరణకు అదనంగా రూ. 123.98కోట్లు మంజూరు చేశారు. కాలువల్లో నీరు సాఫీగా ప్రవహించడానికి ఇరిగేషన్ అధికారులు 118 స్ట్రక్చర్స్ డిజైన్ చేశారు. 71చోట్ల వంతెనలు, 4కిలోమీటర్ల మేర గైడ్‌వాల్స్‌ను ప్రతిపాదించారు. 20 చోట్ల వంతెనల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడుచోట్ల పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర రహదారులపై 12మీటర్ల వెడల్పు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్ల వెంట 7.50 మీటర్లు, వ్యవసాయబావుల వద్దకు వెళ్లే దారులపై 4.25మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. వంతెనలకు నలువైపులా ప్రొటెక్షన్‌వాల్స్‌ను నిర్మిస్తున్నారు.
విస్తరణ ఇలా..
ధర్మారెడ్డిపల్లి కత్వ 0 కి.మీ నుంచి గోకారం చెరువు వరకు కాలువ వెడల్పు 10మీటర్లు (అడుగుభాగం), గోకారం నుంచి చిట్యాల మండలం శివనేనిగూడెం మహాలింగం చెరువు వరకు అడుగుభాగం ఆరు మీటర్లు ఉండే విధంగా కాలువను విస్తరిస్తున్నారు. విస్తరణ పనులను నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిలు ఐబీ అధికారులు, రైతులతో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే వానాకాలం సీజన్‌నాటికి నీరు అందించే అవకాశం ఉంది.
ఫ ధర్మారెడ్డికాలువపై 118స్ట్రక్చర్స్ నిర్మాణానికి ప్రణాళిక
ఫ ఏడు చోట్ల వంతెనలు పూర్తి ..13చోట్ల పురోగతిలో..
ఫ 4కి.మీ మేర గైడ్‌వాల్స్
ఫ చివరి దశలో తవ్వకం పనులు
సాఫీగా నీరు పారేలా..
సాఫీగా నీరు పారేలా..


