16న ఫొటోతో కూడిన జాబితా
446 బ్యాలెట్ బాక్స్‌లు
సాక్షి, యాదాద్రి : మున్సిపల్ పోరుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో 16న ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటన, బ్యాలెట్‌బాక్సులు, బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవడం, సిబ్బంది నియామకంపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 600 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున వార్డుకు రెండు కేంద్రాలు ఏర్పాటు చేసేలా చర్యలు ప్రారంభించారు.
16న ఫొటోతో కూడిన తుది జాబితా
మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు తది జాబితాను ఈనెల 12న విడుదల చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 10వతేదీనే తుది జాబితాను విడుదల చేయాల్సి ఉంది. అయితే ముసాయిదాజాబితాలపై పెద్ద ఎత్తున వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 13వ తేదీన నూతనంగా ఏర్పాటుచేసే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితాలను మున్సిపల కమిషనర్లు విడుదల చేస్తారు. ప్రతివార్డు పరిధిలో ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండు పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ముసాయిదాను టీ పోల్‌లో అప్‌లోడ్ చేస్తారు. 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాలను ప్రకటిస్తారు. వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 600ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
పోలింగ్ సిబ్బంది సిద్ధం
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ అధికారులు, సిబ్బందిని సిద్ధం చేశారు. ఎన్నికల అఽధికారులకు విధుల కేటాయింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కౌంటింగ్‌కేంద్రాల ఏర్పాటును సిద్ధం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నాటినుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలుకు సన్నాహాలు ప్రారంభించారు.
మున్సిపాలిటీ వార్డులు బాలెట్ రిటర్నింగ్
బాక్స్‌లు అధికారులు
భువనగిరి 35 173 14
ఆలేరు 12 58 05
చౌటుప్పల్ 20 96 08
మోత్కూరు 12 30 05
పోచంపల్లి 13 31 05
యాదగిరిగుట్ట 12 58 05
ఈ సారి బ్యాలెట్ బాక్స్‌ల ద్వారా పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 2005 నుంచి మున్సిపల్ ఎన్నికలు ఈ వీఎంల ద్వారా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే బ్యాలెట్ పద్ధతిన పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య ఆధారంగా రెండునుంచి మూడు చొప్పున బ్యాలెట్ బాక్స్‌లు అంటే మొత్తం పదిశాతం అదనంగా కలుపుకుని 446 బాక్సులు ఏర్పాటు చేయనున్నారు.
ఫ వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఏర్పాటుకు కసరత్తు
ఫ ఒక్కో పోలింగ్ కేంద్రంలో 600మంది ఓటర్లు
ఫ బ్యాలెట్ బాక్సులు, పత్రాలు సిద్ధం చేసే పనిలో బిజీ
ఫ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఈసీ దిశానిర్దేశం


