ఆరుట్ల దంపతుల చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలి
ఆత్మకూరు(ఎం): ఆరుట్ల కమలాదేవి–రామచంద్రారెడ్డి దంపతుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆత్మకూరు(ఎం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరుట్ల కమలాదేవి–రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న నియోజక వర్గ స్థాయి క్రీడోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదల పక్షాన నిలబడి తుపాకీ చేతబట్టి సాయిధ పోరాటంలో పాల్గొనడం వల్ల మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏటా క్రీడోత్సవాలను నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రతినిధులను అభినందిస్తున్నానని చెప్పారు. ఆత్మకూరు(ఎం)లో యువజన మండలి కోరిక మేరకు ఓపెన్ జిమ్‌కు రూ. 2లక్షలు, రక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి రూ. 3లక్షలు ఎంపీ కోటా కింద మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ఆరుట్ల కమలాదేవి–రామచంద్రారెడ్డి ఇద్దరు మహానీయులుగా చరిత్రలో నిలిచిపోయినట్లు చెప్పారు. రాష్ట్ర మహిళా అభివృద్ధి సహకార సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి మాట్లాడుతూ ఆరుట్ల దంపతుల జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని అన్నారు. ఎంఈఓ కొత్త మహాదేవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ ఆరుట్ల సుశీల, స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి కందాడి అనంతరెడ్డి, స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి, ఏఏపీసీ చైర్మన్ సుగుణమ్మ, తహసీల్దార్ వి. లావణ్య, వలిగొండ ఎంఈఓ భాస్కర్, రిటైర్డ్ హెచ్‌ఎం గోపాల్‌రెడ్డి, ఆరుట్ల కుటుంట సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, మమత, సీపీఐ జిల్లా కార్యదర్శి దామోదర్‌రెడ్డి, ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్, నేతాజీ యువజన మండలి అధ్యక్షుడు దొంతరబోయిన మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి యాస మహేందర్‌రెడ్డి,నాయకులు యాస లక్ష్మారెడ్డి, బీసు చందర్‌రెడ్డి, ఉప్పల ముత్యాలు, రచ్చ గోవర్ధన్, గజరాజు కాశీఽనాఽఽథ్ పాల్గొన్నారు.
ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి


