హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం
చిట్యాల: కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల హామీనిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బాకీ కార్డులను ఆదివారం చిట్యాల మున్సిపాలిటీలోని 8వ వార్డులో ఇంటింటికి వెళ్లి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బాకీ పడిన మొత్తాన్ని, రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను వార్డు ప్రజలకు వివరించారు. అనంతరం చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ హయాంలోనే చిట్యాల మున్సిపాలిటీలో సుమారుగా రూ.30కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వైకుంఠధామం, ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాజ్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ దుకాణ సముదాయాల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో చిట్యాల మున్సిపాలిటీలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేపట్టలేదని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మాజీ జెడ్పీటీసీ శేపూరి రవీంధర్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ మెండె సైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నాయకులు జమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి, జిట్ట బొందయ్య, కందాటి రమేష్‌రెడ్డి, రుద్రవరం యాదయ్య, కన్నెబోయిన శ్రీశైలం, ఆగు అశోక్, జిట్ట శేఖర్, ఆవుల ఆనంద్, అమరోజు నవీన్‌కుమార్, విఠల్‌రెడ్డి, ఉపేందర్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


