రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి
చిట్యాల: చిట్యాల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి (ముప్ప నర్సింహారెడ్డి) (84) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా, జియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా విధులు నిర్వహించారు. 2004 నుంచి 2007 వరకు భూదాన్‌పోచంపల్లిలోని శ్రీ స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఆయనకు భార్య భారతి, కుమార్తె అర్పిత, అల్లుడు గోపాల్‌రెడ్డి(మద్యప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరి) ఉన్నారు. ఎంఎన్ రెడ్డి మనవడితో ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కుమార్తెతో వివాహమైంది. ఎంఎన్.రెడ్డి మృతదేహాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాళులర్పించారు. చిట్యాల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎంఎన్.రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు.
సంతాపం
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి మృతి పట్ల ఆదివారం సంస్థ చైర్మన్ కిషోర్‌రెడ్డి, డైరెక్టర్ హరికృష్ణ, వైఎస్ చక్రవర్తిస్వామి, అధ్యాపకులు సంతాపం తెలిపారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డికి నివాళి


