ప్రశాంతంగా టెట్
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని దేశ్‌ముఖిలో గల విజ్ఞాన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆదివారం నిర్వహించిన టెట్ పేపర్–2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి 4.30 వరకు సైన్స్, గణితం పరీక్షలు నిర్వహించారు. 100 మంది విద్యార్థులకు గాను 84 మంది హాజరయ్యారు. 16 మంది గైర్హాజరయ్యారని డీఈఓ సత్యనారాయణ తెలిపారు.
ఆదిమహావిష్ణువు
ఆలయ హుండీ లెక్కింపు
చౌటుప్పల్ : మండల పరిధిలోని దేవలమ్మనాగారం శ్రీఆదిమహా విష్ణువు ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీల్లో భక్తులు సమర్పించి నగదు, కానుకలను ఆదివారం లెక్కించారు. నగదు లక్షా 62 వేలు సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు వరకాంతం జంగారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు జంగం శ్రీనివాస్‌రెడ్డి, ప్రతినిధులు అత్తాపురం వెంకట్‌రెడ్డి, సర్పంచ్ సురుగు గౌరీశ్రీను, గట్టు సాలయ్య, పన్నాల రాజురెడ్డి, రమేష్, దానయ్య, రాము, మైసయ్య, సత్తయ్య, మనోహర్, శ్రీను, రాములు, భిక్షపతి, శ్రీను, రాజేష్ పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
పంచామృతాభిషేకం
భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువైన ఆండాళ్ అమ్మవారికి నవకలశ పూర్వక పంచామృతాభిషేకం అర్చకులు నేత్రపర్వంగా జరిపించారు. అంతకుముందు సుభ్రబాత సేవ, సహస్రనామార్చన సేవ, సాయంత్రం తిరువీధిఉత్సవ సేవ తదితర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ, గోపి కృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలి
భూదాన్‌పోచంపల్లి : మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరు నర్వోత్తమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. సమష్టిగా పనిచేసి అన్ని మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డబ్బీకార్ సాహేశ్, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం, కిసాన్‌మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సుర్కంటి రంగారెడ్డి, బీజెపీ మండల అధ్యక్షుడు మేకల రవీందర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఎన్నం శివకుమార్, చిక్క కృష్ణ, గంజి బస్వలింగం, చెరుకు వెంకటేశం, ఏలే శ్రీనివాస్, గొలనుకొండ ప్రభాకర్, రచ్చ సత్యనారాయణ, బడుగు శ్రీకాంత్, సిద్ధు పాల్గొన్నారు.
ప్రశాంతంగా టెట్
ప్రశాంతంగా టెట్


