ఒకే కుటుంబంలోని ఓట్లు చెల్లాచెదురు
ఎమ్మెల్యేల వద్దకు ఆశావహులు
వార్డుల మార్పుపైనే అధికంగా..
ఓటరు జాబితా అంశం తమ పరిఽధిలోనిది కాదని మున్సిపల్ అధికారులు దరఖాస్తుదారులకు చెబుతున్నారు. ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు.. అన్నీ రెవెన్యూ అధికారుల బాధ్యతేనని సూచిస్తున్నారు.ఎన్నికల అధికారులు ఇచ్చిన ఓటరు జాబితా ప్రకారం తాము ఓటింగ్ నిర్వహిస్తామని అంటుడటం.. చెల్లాచెదురైన ఓటర్లు, చిరునామాలు తప్పులున్న ఓటర్లు అయోమయంలో ఉన్నారు.ఉన్నతాధికారులను కలిసే పనిలో కొందరు ఉన్నారు.
సాక్షి, యాదాద్రి : మున్సిపాలిటీల్లో ఈనెల 1న జారీ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తప్పుల తడకగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఓటర్ లిస్టు ఆధారంగా వెల్లడించిన ఈ జాబితాలో అనేక తప్పులు దొర్లాయి. ఒకే కుటుంబంలోని ఓట్లు చెల్లాచెదురై వేర్వేరు వార్డుల్లో నమోదయ్యాయి. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వస్తుండటంతో, వాటిని సరిదిద్దే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. మొదటి రోజు శుక్రవారం 50కి పైగా దరఖాస్తులు రాగా, శనివారం ఆ సంఖ్య రెట్టింపు ఉంది.
● ఆలేరు మున్సిపాలిటీలో 1వ వార్డుకు చెందిన రెండు కొత్త ఓట్లు కొలనుపాక జాబితాలో చేరాయి. పట్టణంలోని కొలనుపాక రోడ్డులో 1.237బై1 ఇంటిలో ఉంటున్న ఇద్దరు యువకులు గతంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకోగా.. కొలనుపాక పంచాయతీ జాబితాలో వచ్చాయి. ఇలా ఆలేరు పట్టణానికి చెందిన సుమారు 50 ఓట్లు కొలనుపాకలోకి వెళ్లాయి.
● ఆలేరులోని 7, 8, 9 వార్డుల్లో ఒకే కుటుంబంలోని ఓట్లు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో నమోదయ్యాయి. ఒక కుటుంబ ఓట్లన్నీ ఒకే వార్డులో ఉండాలన్న నిబంధన అమలు కాలేదు. బీసీ కాలనీ, సిల్క్‌నగర్, మార్కండేయకాలనీ, భరత్‌నగర్, మెయిన్‌రోడ్డులో పదుల సంఖ్యలో ఓట్లు వేర్వేరు వార్డుల జాబితాల్లో వచ్చాయి.
నివాసం ఉంటున్న వార్డుకు మార్చండి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రెండో రోజు శనివారం 25 మంది డ్రాఫ్ట్ లిస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు అందజేశారు. తమ ఓట్లు ఇతర వార్డులో ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోకి మార్చాలని దరఖాస్తులో కోరారు. కాగా ఎక్కువగా 10, 9వ వార్డు నుంచి దరఖాస్తులు వచ్చాయని మున్సిపల్ కమిషనర్ లింగస్వామి వెల్లడించారు. గతంలో ఓటర్ జాబితాలో తమ అడ్రస్ మార్చుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఫ వేర్వేరు వార్డుల్లో నమోదు
ఫ గందరగోళంగా
ముసాయిదా ఓటరు జాబితా
ఫ ప్రజల నుంచి అభ్యంతరాలు
రిజర్వేషన్లు ఖరారు కానప్పటికీ ఆశావహులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తే తమకు గెలుపు అవకాశాలుంటాయని అంచనాలో ఉన్నారు. అయితే డ్రాఫ్ట్ లిస్ట్ కొన్ని చోట్ల ఆశావహులకు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది. తమకే పడుతాయనుకున్న ఓట్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడం, చనిపోయిన వారి ఓట్లను తొలగించకపోవడం, కొత్త ఓట్లను పక్క వార్డులు, పొరుగు గ్రామ పంచాయతీల్లో నమోదవడం ఆశావహులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆశావహులు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చేలా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
భూదాన్‌పోచంపల్లి : ముసాయిదా ఓటరు జాబితాపై శనివారం పది మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దరఖాస్తులు అందజేశారని అంజన్‌రెడ్డి తెలిపారు. ఎక్కువగా వార్డుమార్పుపై వచ్చిన దరఖాస్తులే ఉన్నాయని చెప్పారు. ఓటరు జాబితాపై ఈనెల 5వ తేదీన అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
ఒకే కుటుంబంలోని ఓట్లు చెల్లాచెదురు
ఒకే కుటుంబంలోని ఓట్లు చెల్లాచెదురు
ఒకే కుటుంబంలోని ఓట్లు చెల్లాచెదురు


