జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
నాగార్జునసాగర్ : జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకుల కళాశాల విద్యార్థి అనిల్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రవికుమార్ తెలిపారు. గురుకుల జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అనిల్‌కుమార్ ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో అనిల్ పాల్గొననున్నట్లు వివరించారు. అనిల్‌ను ప్రిన్సిపాల్‌తో పాటు వ్యాయామ ఉపాధ్యాయురాలు జ్యోతిఅరుణ, నర్సింహ తదితరులు అభినందించారు.
ఖోఖో జిల్లా జట్టు కెప్టెన్‌గా అజయ్ కార్తీక్..
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో జట్టు కెప్టెన్‌గా నాగార్జునసాగర్‌లోని బీసీ గురుకుల పాఠశాలకు చెందిన అజయ్ కార్తీక్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అమెరికాలో చౌటుప్పల్ యువకుడు
గుండెపోటుతో మృతి
● యువకుడికి ఫిబ్రవరి 21న విహహం జరగాల్సి ఉంది
చౌటుప్పల్ : చౌటుప్పల్‌కు చెందిన యువకుడు అమెరికాలో మృతిచెందాడు. పట్టణానికి చెందిన గోశిక వెంకటేశం–గాయత్రి దంపతులకు నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో ముగ్గురు కుమారులు అమెరికాలోని న్యూయార్క్‌లో విద్యాభ్యాసం చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం క్రితం వరకు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేచోట ఉండేవారు. రెండో కుమారుడైన యశ్వంత్(28) ఉద్యోగరీత్యా ఇటీవల తన సోదరుల గదిలో కాకుండా వేరే చోట ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం తన గదిలో గుండెపోటుకు గురై నిద్రలోనే మృతిచెందాడు. మరుసటి రోజున అతను మరణించిన విషయాన్ని అక్కడి స్థానికులు గుర్తించారు. యశ్వంత్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అక్కడి తెలుగు అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. యశ్వంత్‌కు వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే పెద్దలు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. యశ్వంత్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక


