దేవరకొండ ఖిలా సందర్శన
దేవరకొండ : దేవరకొండ ఖిలాను తెలంగాణ హెరిటేజ్(పురావస్తు శాఖ) డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్‌రావ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఖిలాలోని ప్రధాన కోట ద్వారాలు, శిథిలావస్థకు చేరిన కట్టడాలను ఆయన పరిశీలించారు. దేవరకొండ కోటకు ఎంతో ప్రాచుర్యం ఉందని తెలిపారు. కోట పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, రాములునాయక్, యూనుస్ ఫర్హాన్, మున్సిపల్ అధికారులు సకృనాయక్, అర్చన, వర్షిత తదితరులు ఉన్నారు.
‘అంగన్‌వాడీ పిల్లలం’ పాటకు ప్రశంస
చిట్యాల : మండలంలోని వట్టిమర్తికి చెందిన అంగన్‌వాడీ టీచర్ అక్కెనపల్లి ఇందిర అంగన్‌వాడీ పిల్లలపై రచించి, పాడిన ‘అంగన్‌వాడీ పిల్లలం’ వీడియో పాట బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్ – 2025కు ఎంపికై ంది. హైదరాబాద్‌లోని రవీద్రభారతిలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ ఇందిర, ఆ పాటకు దర్శకత్వం వహించిన భీష్మాచారికి ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.
దేవరకొండ ఖిలా సందర్శన


