
రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ
భువనగిరి: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. 2వ తేదీన వెబ్‌సైట్‌లో ఖాళీల ప్రదర్శన, 3న సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 4న అభ్యతరాలను పరిశీలించి తుది జాబితా విడుదల చేస్తారు. 6న వెబ్ అప్షన్ల అమలు (గ్రేడ్–2 హెచ్‌ఎంలకు), 8న ఎస్‌జీటీల తుది జాబితా విడుదల, 10న ఎస్‌జీటీల వెబ్‌ఆప్షన్‌లు వెల్లడించనున్నారు. 11న స్కూల్ అసిస్టెంట్‌లు, 12న ఎస్‌జీటీల పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. జిల్లాలో 2,939 మంది ఉపాధ్యాయులు ఉండగా 200 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉంది.
మాతృ మరణాలకు తావుండొద్దు
భువనగిరి: మాతృ మరణాల నిర్మూలనకు కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ మనోహర్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాతృ మరణాల జిల్లా ఉప కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హైరిస్క్ గర్భిణుల్లో రక్త హీనత, హైబీపీ వంటి సమస్యలను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాతృ మరణాల నిర్మూలనకు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యచరణ రూపొందించనుందని, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు యశోద, శిల్పిని, ఇందిరామణి, సాయిరమణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పాఠశాలల్లో
ఎన్‌సీసీ యూనిట్‌లు
ఆలేరు: జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌సీసీ యూనిట్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని డీఈఓ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన ఆలేరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలోని ఎన్‌సీసీ యూనిట్‌ను సందర్శించారు. ఎన్‌సీసీ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఎన్‌సీసీ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఈ విభాగాన్ని విద్యార్థులు సద్వినియోం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎన్‌సీసీ విద్యార్థులకు యూనిఫాం అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంఈఓ ఎర్రలక్ష్మి, హెచ్‌ఎం దాసరి మంజుల, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేష్, స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పసుపులేటి నరేంద్రస్వామి, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
నిత్యారాధనలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిత్యారాధనలు శాస్త్రరుక్తంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. ఇక ప్రాకరా మండపంలో శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం తదితర పూజలు నిర్వహించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. స్వామి వారికి రూ.19,89924 ఆదాయం సమకూరినట్లు ఈవో వెంకట్‌రావు తెలిపారు.

రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ

రేపటి నుంచి పదోన్నతుల ప్రక్రియ