
తరగతులు ఐదు.. గది ఒక్కటే!
తుర్కపల్లి: ఒకటి నుంచి 5వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు. అందరికీ ఒకటే గది. ఉపాధ్యాయులు ఇద్దరు ఉండగా ఒకరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రావు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఐదు తరగతుల బోధన బాధ్యతలు హెచ్‌ఎంపైనే పడ్డాయి. ఆయన విద్యాశాఖ నిర్వహించే సమాశాలకు వెళ్లే ఆ రోజు పాఠశాల మూసివేస్తారు. ఈ గదిలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. వంట సామగ్రి సైతం ఇందులోనే భద్రపరుస్తారు.. తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇదీ. పాఠశాల పాత భవనాన్ని కూలగొట్టి నూతన భవనం నిర్మిస్తున్నారు. భవనం పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేయడంతో బీసీ కమ్యూనిటీ హాల్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

తరగతులు ఐదు.. గది ఒక్కటే!