
ఆతిథ్యమిస్తున్న హోటళ్లు
నాగార్జునసాగర్‌లో పర్యాటకులకు అనుగుణంగా హోటళ్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుండటంతో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీంతో హోటల్ బిజినెస్ కూడా పెరిగింది. హిల్‌కాలనీలో విజయ్‌విహార్‌లో నడుస్తున్న హోటల్‌లో దేశ, విదేశీయులు తినే పలురకాల వంటకాలు లభ్యమవుతున్నాయి. అలాగే బుద్ధవనంలో సిద్థార్థ హోటల్, మనోరమ హోటల్, పైలాన్‌కాలనీలో ఇటీవల ఏర్పాటైన టైగర్ వ్యాలీ హోటళ్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కొత్త బ్రిడ్జి అవతలి వైపున ఉన్న మాతా సరోవర్, రైట్ బ్యాంకులో మాతా సరోవర్ హోటళ్లు వెలిశాయి. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హిల్‌కాలనీలో విజయ్‌విహార్ హోటల్‌లో 34 గదులు ఉన్నాయి. ముందస్తుగా ఆన్‌లైన్‌లో టీడీటీజీసీ.ఇన్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి. వివరాలకు 08680–277362 నంబర్‌ను సంప్రందించాలి.