చూసొద్దాం.. రండి
నాగార్జునసాగర్ నుంచి ఏపీలోని మాచర్లకు వెళ్లే దారిలో 14 కిలోమీటర్ల దూరంలో ఎత్తిపోతల జలపాతం ఉంది. చంద్రవంక వాగుపై సహజసిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతం వద్ద 70 అడుగుల పైనుంచి జాలువారే నీటి దృశ్యం పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. ఈ జలపాతం చూసేందుకు టిక్కెట్ ధర పెద్దలకు రూ.30 కాగా పిల్లలకు రూ.20. ఇక్కడ పర్యాటకుల సౌకర్యార్థం రాత్రి బస చేసేందుకు 8 గదులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఫ ప్రపంచ పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్
ఫ చరిత్రకు సజీవ సాక్ష్యంగా
నిలిచే నందికొండ, బుద్ధవనం, నాగార్జునకొండ మ్యూజియం
ఫ చెప్పలేని అనుభూతిని మిగిల్చే
లాంచీ విహారం
గత ఆనవాళ్లకు
చిరునామా అనుపు
హిల్‌కాలనీకి 15 కిలోమీటర్ల దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ అలనాటి నాగార్జున విశ్వవిద్యాయం, ఇక్ష్వాకుల యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణా నది లోయలో లభించిన రంగనాథస్వామి ఆలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణా నది తీరంలో నిర్మించడం విశేషం. తొలి ఏకాదశి పర్వదినాన ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
మనసు దోచే
ఎత్తిపోతల
సాగర్ సోయగాలు
సాగర్ సోయగాలు