
పచ్చందాల అర్బన్ పార్కు
సాగర్ జలాశయ తీరంలో నాగార్జునసాగర్–హైదరాబాద్, సాగర్–నల్లగొండ రహదారుల (సమ్మక్క–సారక్కల) వెంట రూ.1.5కోట్లతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ వన్యప్రాణుల అటవీ కోర్ ఏరియాలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కు పచ్చందాలను ఆరబోస్తోంది. 980 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్కు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలోని గుట్టల మధ్యన సాగర్ బ్యాక్ వాటర్ అందాలను తిలకించేందుకు నెల్లికల్లు అటవీ ప్రాంతంలో వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. అటవీ అందాలను వీక్షించేందుకు రెండు రకాల సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. వాహనంలో 10 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1,000, 24 కిలోమీటర్ల పరిధిలో పర్యటించేందుకు రూ.1500 వసూలు చేస్తున్నారు. సిబ్బంది కొరత మూలంగా పర్యాటకులు అడిగితేనే సఫారీ వాహనాలను నడుపుతున్నారు.

పచ్చందాల అర్బన్ పార్కు