
చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు యత్నం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సూర్యాపేట గ్రామానికి చెందిన నారబోయిన మహేష్ కుమార్తు అశ్విక సూర్యాపేట పట్టణంలోని కాకతీయ స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అశ్విక కొద్దిసేపటికి తర్వాత తోటి పిల్లలతో ఆడుకునేందుకు ఇంటి బయటకు వచ్చింది. అదే సమయంలో బైక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అశ్వికను కిడ్నాప్ చేసేందుకు గాను ఆమెను ఎత్తుకున్నారు. అదే సమయంలో పక్కింటికి చెందిన గాజాని భాను చూసి ‘ఎవరు మీరు.. పాపని తీసుకెళ్తున్నారు’ గట్టిగా అడగడంతో పాపను అక్కడే వదిలేసి పరారయ్యారు. తాను బయటకు వచ్చేలోగా దుండగులు పరారైనట్లు భాను భర్త హరీష్ తెలిపారు.
పక్కింటి మహిళ కేకలు వేయడంతో బైక్‌పై పరారైన గుర్తుతెలియని వ్యక్తులు
ఆత్మకూర్(ఎస్) మండలం
పాత సూర్యాపేట గ్రామంలో ఘటన