ప్రతి ఖాతాదారుడికి న్యాయం చేస్తాం
రైతులంటే చిన్నచూపు
రైతులను పట్టించుకోరా?
భీమవరం: వ్యవసాయమే జీనవాధారమైన జిల్లా రైతులకు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ చేదు అనుభవాలే. రైతులను చిన్నచూపు చూస్తూ వ్యవసాయం దండగంటూ తీవ్ర నిరాశపర్చిన చంద్రబాబు గత ఏడాది సార్వా సీజన్‌లో మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు నేటికీ పెట్టుబడి రాయితీ అందించలేదు. జిల్లాలో దాదాపు 2.35 లక్షల ఎకరాల్లో ప్రతి ఏటా వరిసాగు చేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండిస్తూ రాష్ట్రానికే అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలో నేడు వరి, ఆక్వా సాగు చేస్తున్న రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడు కన్పించడం లేదు.
22 వేల ఎకరాల్లో పంట నష్టం
గత ఏడాది సార్వా సీజన్‌లో రైతన్నలు ఎన్నో ఆశలతో దాదాపు 2.35 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. వ్యయప్రయాసలకోర్చి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి వరి పైరు పండించారు. ఒక్కొక్క ఎకరానికి దాదాపు రూ.35 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పైరు ఏపుగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు 2025 అక్టోబర్‌లో మోంథా తుపాను రూపంలో దెబ్బ తగిలింది. తుపాను కారణంగా పైరు సుడులు తిరిగి పంట నేలనంటింది. చేలలో నీరు నిలిచిపోవడంతో గింజలు మొలకులు వచ్చాయి. కొందరు రైతులు చేలలోని నీటిని మోటర్లు, ఆయిల్ ఇంజిన్ల సాయంతో బయటకుతోడి పంటను దక్కించుకోడానికి ప్రయత్నం చేయగా, మరికొందరు రైతులు సుడులు తిరిగి నేలనంటిని పైరును కట్టలు కట్టి నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. కష్టపడి పండించిన పంటను దక్కించుకోడానికి అనేక ప్రయత్నాలు చేసినా జిల్లాలో సుమారు 22,400 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. దాదాపు 20 వేల మంది రైతులు నష్టపోయారని వారికి సుమారు రూ.22.39 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు.
ఏడాది గడిచినా జాడ లేదు
మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఏడాది గడిచినా ప్రభుత్వం నేటికి పరిహారం అందించ లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న సార్వా పంట నిమిత్తం పరిహారం వస్తుందని అప్పులు చేసి దాళ్వా పండించామని.. నేటికీ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
జంగారెడ్డిగూడెం: బ్యాంక్ ఆఫ్ బరోడా జంగారెడ్డిగూడెం బ్రాంచ్‌లో బంగారపు రుణాల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ప్రతి ఖాతాదారుడికి పూర్తి న్యాయం చేస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని ఆ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ మేనేజర్ ఎస్‌కే కిరణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ అంతర్గత తనిఖీల్లో అవకతవకలు బయటపడిన వెంటనే, కస్టమర్ల ప్రయోజనాల కోసం తామే స్వయంగా త్వరితగతిన చర్యలు ప్రారంభించామన్నారు. బ్రాంచ్‌లోని అన్ని బంగారు రుణ ఖాతాలను, బంగారం మూటలను తక్షణమే మళ్లీ సమగ్రంగా రీ–అప్రైజల్ (పునఃమూల్యాంకనం) చేయిస్తున్నామని తెలిపారు. పూర్తి పారదర్శకత కోసం, ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా సంబంధిత ఖాతాదారుల సమక్షంలోనే వారి బంగారు ప్యాకెట్లను సరిచూస్తున్నామని వివరించారు. జంగారెడ్డిగూడెం బ్రాంచ్ సిబ్బందికి తోడుగా, ఈ పనుల కోసమే ప్రత్యేకంగా అదనపు అధికారులను, సిబ్బందిని కూడా కేటాయించినట్లు వెల్లడించారు. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం వచ్చే ప్రతి ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకుని, తగిన రీతిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బాధితులెవరూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ఖాతాదారుల బంగారానికి, నమ్మకానికి బ్యాంక్ పూర్తి బాధ్యత వహిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారం సజావుగా సాగుతుందని, ఖాతాదారులు బ్యాంకుకు సహకరించాలని రీజినల్ మేనేజర్ ఎస్‌కే కిరణ్ రెడ్డి కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతులంటే ఎప్పుడూ చిన్నచూపే. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లభించదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించన దాఖలాలు లేవు. మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఏడాది కావస్తున్నా పరిహారం ఇవ్వకపోవడం దారుణం.
– గాదిరాజు రామరాజు, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు భీమవరం
గతంలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు రైతుల గురించి పట్టించుకుంటారని అనుకోవడం భ్రమే. ఏడాదిగా పంట నష్టపరిహారం అందక వరి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఆక్వా ఫీడ్ ధరలు పెంపు, రొయ్యల ధరలు తగ్గిపోయి నష్టపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
– పాలవెల్లి మంగ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, భీమవరం
గతేడాది మోంథా తుపానుకు జిల్లాలో 22 వేల ఎకరాల్లో పంట నష్టం
సుమారు రూ.22 కోట్లపంట నష్టం అంచనా
ఇప్పటివరకు రైతులకు అందని పరిహారం


