పెద్దింట్లమ్మకు విశేష పూజలు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. ఆదివారం ఒక్క రోజున అమ్మవారి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదులు, అమ్మ చిత్రపటాలు అమ్మకం, విరాళాలు, వాహన పూజల ద్వారా రూ.36,025 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.
కాళ్ల: ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయం భూః శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆదివారం కూడారై పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కూడారై అక్కరసు (పాయసం) ప్రసాదాన్ని తయారు చేసి 1,350 గిన్నెలతో స్వామి, అమ్మ వార్లకు నివేదించారు. ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పాశురములు, గానం చేశారు. దేవాలయంనందు వివిధ రకాల పుష్పాలతో శంఖు, చక్రం, నామాలతో అలంకరణలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల ప్రసాదాలు స్వీకరించారు. యతిరాజుల ఆండాళ్ గోష్టి వారు గోదాదేవి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
భీమవరం: పట్టణంలోని రైతు బజార్ ప్రాంతంలో మద్యం షాపు వద్ద ఒక వ్యక్తిపై మద్యం మత్తులో దాడిచేసి గాయపర్చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్సై బీవై కిరణ్‌కుమార్ చెప్పారు.
మహిళపై దౌర్జన్యం కేసు
భీమవరం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని చినరంగనిపాలెం ప్రాంతానికి చెందిన మహిళపై ప్రసన్నకుమారి, నర్సింహులు, మరో నలుగురు దౌర్జన్యం చేశారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్సై కృష్ణాజీ చెప్పారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గులాబీ కలర్ టీ షర్ట్, నల్లరంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఫిట్స్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
పెద్దింట్లమ్మకు విశేష పూజలు
పెద్దింట్లమ్మకు విశేష పూజలు


