స్వాగత ద్వారంపై రాజకీయ ఫ్లెక్సీ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శ్రీవారి కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డులోని ఆర్చిగేటు (స్వాగత ద్వారం)కు కొందరు టీడీపీ నాయకులు ఆదివారం రాజకీయ ఫ్లెక్సీని అమర్చడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇది ఆధ్యాత్మిక కేంద్రమా.. లేక రాజకీయ కేంద్రమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ఆదివారం ఉదయం యాదవ కల్యాణ మండప ప్రాంతంలో మల్టీపర్పస్ భవనం అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. దీనిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఏకంగా ఆర్చిగేటుకు ఫ్లెక్సీని అమర్చారు. ఇది వివాదాస్పదమైంది. అయినా దేవస్థానం అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో గరుడాళ్వార్ సెంటర్‌లో, లింగయ్య చెరువు మలుపులో వివిధ రాజకీయ పార్టీల నేతల ఫ్లెక్సీలు ఉండగా భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే దేవస్థానం అధికారులు వీటిని తొలగించారు.
ముక్కున వేలేసుకుంటున్న భక్తులు


