వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

Aug 2 2025 7:14 AM | Updated on Aug 2 2025 7:14 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

ఆకివీడు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సోషల్‌ మీడియా జాయింట్‌ సెక్రటరీగా కమతం మహేష్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు సూచనల మేరకు నియామకం జరిగినట్లు మహేష్‌ తెలిపారు.

ఉంగుటూరు: వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎ.గోకవరానికి చెందిన మిద్దే వెంకటేశ్వరరావును నియమించారు. పార్టీ అధినేత జగన్‌, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

చింతలపూడి: బీసీ విభాగం ఏలూరు జిల్లా కార్యదర్శిగా చింతలపూడి మండలం, రేచర్ల గ్రామానికి చెందిన పెరుగొండ్ర శివరామకృష్ణను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

పెనుగొండ: వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆచంట నియోజకవర్గం మార్టేరుకు చెందిన మండ విశ్వనాథ నారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

దెందులూరు: వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీగా దెందులూరు నియోజవర్గం నుంచి చల్లారి హేమంత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామక ఆదేశాలు జారీ చేశారు.

బుట్టాయగూడెం: వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగం రాష్ట్ర కమిటీ ప్రచార వింగ్‌ కార్యదర్శిగా పోలవరం నియోజకవర్గం నుంచి కొయ్యలగూడెంకు చెందిన తమిర్చి బ్రహ్మయ్యను నియమిస్తూ శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

చింతలపూడి: చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంకు చెందిన త్సల్లాబత్తుల శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు 1
1/5

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు 2
2/5

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు 3
3/5

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు 4
4/5

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు 5
5/5

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement