
2న ఉపాధ్యాయుల ధర్నా
భీమవరం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శనివారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పెన్మెత్స విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా సన్నాహక సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్ రద్దు, యాప్స్ భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, పెండింగ్ బకాయిలతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలనిఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా యూనిట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ధర్నాలో జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో కో–చైర్మన్ పెన్మెత్స ఆర్‌వీఎస్ సాయివర్మ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమణారావు, కో–చైర్మన్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పీ4పై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్) : పీ4 కార్యక్రమంలో మార్గదర్శకులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లకు సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించగా భీమవరం కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు.