
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్
ద్వారకాతిరుమల: ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామానికి చెందిన వ్యాన్ క్లీనర్ యెరిట సూర్యనారాయణ (21), డ్రైవర్ జి.సురేష్ గతనెల 29న మొక్కజొన్న పొత్తులు లోడింగ్ నిమిత్తం వినుకొండ వెళ్లారు. తిరిగి లోడుతో స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ సురేష్‌ను స్థానికులు హుటాహుటీన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్లీనర్ మృతి, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్