
కొడుకుపై కన్నతల్లి దాడి
కొయ్యలగూడెం: మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడిపై ఓ తల్లి విచక్షణ కోల్పోయి దాడి చేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిన ఘటన గురువారం జరిగింది. వివరాల ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన తొంట కుమారి భర్త గతంలోనే మృతిచెందాడు. వీరికి కుమార్తె, మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడు ఉన్నారు. కుమార్తెను ఆమె భర్త విడిచిపెట్టడంతో తల్లి దగ్గరే ఉంటోంది. గురువారం తల్లికి, కుమారుడికి మధ్య ఏర్పడిన వివాదంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన తల్లి కుమారుడిని తలపై కర్రతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తీవ్ర గాయాలపాలైన కుమారుడు