
సమస్యలు పరిష్కరించాలి
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. గతంలో ప్రభుత్వం వెల్పేర్ బోర్డు ద్వారా అమలు చేసిన సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– బండి శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు, వీరవాసరం
పోరుబాట తప్పదు
భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వెల్పేర్ బోర్డును పునరుద్దరించకుంటే పోరుబాట తప్పదు. చేతినిండా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ ప్రోత్సహం కూడా కరువైతే పరిస్థితి మరింత దుర్బరంగా మారుతుంది.
– మండ సూరిబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి
ఆందోళనలు ఉధృతం చేస్తాం
వెల్పేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందచేశాం.
– నారపల్లి రమణరావు,
భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
●

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి