
పెదతాడేపల్లి గురుకులం జాతికి అంకితం
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం వీడియో సమావేశం ద్వారా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేసినట్లు ప్రిన్సిపాల్ బి.రాజారావు తెలిపారు. ఆయనతో పాటు సహాయ మంత్రులు సుకాంత్ మజుందార్, జయంత్ చౌదరి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పీఎంశ్రీ పథకాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలోని 26 పీఎంశ్రీలలో ఉత్తమ పాఠశాలగా పెదతాడేపల్లి గురుకులాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. డీఈవో నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ శ్యామ్ సుందర్, ఏఎంవో సుబ్రహ్మణ్యం, మండల విద్యాశాఖ అధికారి వి.హనుమ, పేరెంట్స్ కమిటి వైస్ చైర్‌పర్సన్ ఇందిర పాల్గొన్నారు.

పెదతాడేపల్లి గురుకులం జాతికి అంకితం